పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు చాణూరుని జంపుట

ప్పుడు దనుజారి యామహాజట్టిఁ 
ప్పకఁ జూచి యుద్ధత శక్తి మెఱసి -
పిడికిటఁ బొడిచినఁ బెంపేది వాఁడు 
డియొడ్డ నిల్చి యాపంకజోదరుని 
క్షంబు శిరమున డిదాఁకుటయును. 
క్షించి హరివాని వెనుకకుఁ ద్రోచి 
కుడిరెట్టవట్టి పెలుకుఱఁ ద్రిప్పి నెలఁ 
వైచి తన్ని గొబ్బన మీఁదికుఱికి 
మెడఁ ద్రొక్కి యినుముసమ్మెట మ్రోదినట్లు 
బడ ముష్టిఘాల మేను నొంప; 
వెడొంది పట్టెమ్ము విఱిగి గుండియలు 
గిలి చాణూరుండు ప్రాణముల్ విడిచె.